Header Banner

ముంబయి సమీపంలో మత్స్యకారుల పడవకు మంటలు! 80% కాలిపోయిన బోటు!

  Fri Feb 28, 2025 15:55        Others

ముంబయి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 20 మంది ప్రయాణిస్తున్న ఈ పడవ దాదాపు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులు..

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో సముద్రంలో మత్స్యకారులు ప్రయాణిస్తున్న ఓ పడవ మంటల్లో చిక్కుకుంది. దాదాపు 18-20 మంది మత్స్యకారులు చేపల వేటకోసం బోటులో బయల్దేరి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య పడవలో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. చేపల వేటకు సముద్రంపై పడవలో జాలర్లు ప్రయాణించే సమయంలో హఠాత్తుగా పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి.


 
ముంబై సమీపంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ భారీ మంటల్లో చిక్కుకుంది. దాదాపు 80 శాతం పడవ కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో 18-20 మంది జాలర్లు పడవలో ఉన్నారు. బోటు చుట్టుతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానిక జాలర్లు చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జాలర్లను కాపాడారు. పడవను ఒడ్డుకు చేర్చి మంటలను ఆర్పివేసినా అప్పటికే చాలావరకూ కాలిపోయింది.

 

బోటు 80శాతం కాలిపోయినా అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు లేకుండా అధికారుల సాయంతో తృటిలో తప్పించుకోగలిగారు జాలర్లు. అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పడవలో ఉన్న చేపల వల మంటలకు వ్యాప్తికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #AndhraPradesh #MumbaiBoatFire #FishingBoatAccident #FishermenRescued #SeaFireIncident #AlibaugAccident